భారత్-పాక్ సరిహద్దు గ్రామాల్లో మంత్రి బండి సంజయ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోని పంజాబ్ రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న గ్రామాలను శనివారం సందర్శించారు. రావి నది వరదల వల్ల వేలాది ఎకరాల్లో మేటలు వేసిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సరిహద్దు ముప్పు బాధితులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించిందని, బీఎస్ఎఫ్ జవాన్లు అండగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
