ఎంజీఎం ఆసుపత్రిని తనిఖీ చేసిన: ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి:


జ్ఞాన తెలంగాణ,హనుమకొండ:
గురువారం నాడు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం తనిఖీ చేశారు. నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఎంజీఎం హాస్పిటల్ లో జనరేటర్ల పై నడుస్తుంటే కూడా పెద్ద భూతద్దం లో చూపిస్తున్నారు అని అన్నారు. కరెంటు పోయేది మన చేతిలో ఉండదు కదా అని అన్నారు. అక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని,వెంటనే విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశామని,విచారణ జరిగిన వెంటనే అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.గత పదేళ్లలో ఎంజీఎం లో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదని అన్నారు. కరెంటు ఎన్నిసార్లు పోయిందో ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. గత బి ఆర్ ఎస్ పాలనలో హాస్పటల్లో పేషంట్లను ఎలుకలు కొరకు తింటున్న స్పందించని గత మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు కరెంటు లేదని కేటీఆర్ మాటలను ప్రజలు నమ్మరని అన్నారు.గతంలో సెంట్రల్ జెల్ కూల్చివేసి 700 కోట్లు ఎత్తుకుపోయారని విమర్శించారు. గత బిఆర్ఎస్ పాలనలో మంత్రులు,ఎమ్మెల్యేలు జిల్లా మీద పడి దోచుకున్నారని అన్నారు. ఇకనుండి ఎంజిఎం హాస్పిటల్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతామని, ఈ సందర్భంగా ఎంజీఎం సిబ్బందిని కోరేది ఒకటి పేషంట్లను నిర్లక్ష్యం చేయకండి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు అని అన్నారు. ఇకపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తామని,ఎంజీఎం లో ఉన్న మిషనరీని ఎందుకు వాడటం లేదని, చెదలుపట్టి పడేసారని వాటన్నిటిని గత ప్రభుత్వం ఎందుకు రిపేర్ చేయలేదని విమర్శించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు లాభం చేకూర్చే విధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందని అన్నారు. ఉన్న ఎంజిఎం హాస్పటల్ ను పట్టించుకోని మీరు, కమిషన్ల కోసం నగరంలోని ప్రఖ్యాతిగాంచిన సెంట్రల్ జైలు కూలగొట్టి వాటి పత్రాలను మహారాష్ట్ర బ్యాంకులో తాకట్టుపెట్టి వేలకోట్లు దండుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు? ఎన్నికల సమయంలో మాయమాటలతో మోసం చేస్తూ ఎన్నికల్లో లబ్ది చేకూరడానికి బి ఆర్ ఎస్ నాయకులు ఆడుతున్న నాటకం అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమన్,రాములు,మామిండ్ల రాజు,చీకటి శారద ఆనంద్, ఓబిసి డిపార్ట్మెంట్ చైర్మన్ బొమ్మతి విక్రమ్, సీనియర్ నాయకులు కట్ట రఘుపాల్ రెడ్డి,మల్లారెడ్డి,ఎంజీఎం సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...

Translate »