స్త్రీ పురుష సమానత్వం కై పోరాడుదాం


లింగ వివక్షకు ,శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పోరాడుదాం :

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 2:

నారాయణపేట జిల్లా చిన్న జట్రం గ్రామంలో ప్రగతిశీల మహిళా సంఘం(POW) ఆధ్వర్యంలో జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత జిల్లా అధ్యక్షురాలు శారద అధ్యక్షత వహించగా ఈ క్లాసులను సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి బి రాము ప్రారంభించగా ముఖ్య వక్తలుగా వచ్చినటువంటి పి ఓ డబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు స్వరూప మాట్లాడుతూ సమాజంలో సభాగమైన మహిళలు సామాజిక , మత,కుల,లింగ వివక్షత, శ్రమ దోపిడీకి గురవుతున్నారు. సాంఘిక దురాచారాలు,మతం మనువాదం, సనాతన ధర్మం, మహిళలను అణిచివేస్తుందన్నారు. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గురజాడ అప్పారావు రాజా రామ్మోహన్
రావు సంఘసంస్కర్తలు ఎందరో వాటిని రూపుమాపే కొత్త సమాజాన్ని వెలుగు చూడాలని భావించారు. ఎన్నో దారుణాలు మహిళలపై అమానవీయ సంఘటనలు,నేటికీ ఇంకా కొనసాగునే ఉన్నాయి. గుజరాత్, మణిపూర్, కత్వ ఉన్నావ్, సంఘటనలు అనేక దారుణాలు జరిగాయి
బేటి బచావో బేటి పడావో, నిర్బర భారత్, వికసిత భారత్, అచ్చేదిన్ అనే నినాదాలు దేశంలో మోడీ పేదరికంనుంచి దూరం చేయలేకపో యాన్నారు . శ్రామికుల ఆదాయం రోజురోజుకీ పడిపోయిందన్నారు నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయన్నారు. బిజెపి అనుసరిస్తున్న ప్రజాస్వామిక కార్పొరేషన్ అనుకూల విధానం వల్ల శ్రామిక మహిళలపై దోపిడీ కొనసాగుతూనే ఉందన్నారు .సమాజ మార్పు కోసం మహిళలు చైతన్యవంతంగా హక్కుల సాధన కోసం ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూరాష్ట్ర సహాయ కార్యదర్శి జయలక్ష్మి, జిల్లా కార్యదర్శి, సౌజన్య, సహాయ కార్యదర్శి భాగ్యలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు సునీత, మంజుల, సుజాత, సావిత్రమ్మ, లలిత, రాధమ్మ, రాధిక, సుజాత, ఈ కార్యక్రమంలో 50 మంది మహిళలు పాల్గొన్నారు.

You may also like...

Translate »