చెరువుల్లో పూడికతీత పనులు ప్రారంభించిన జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజవర్గ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య.

చెరువుల్లో పూడికతీత పనులు ప్రారంభించిన జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజవర్గ అధ్యక్షులు మంచాల ఎల్లయ్య.
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
ఈ రోజు జఫర్గడ్ మండల కేంద్రంలో పూడికతీత పనులు ప్రారంభం రైతులు సద్వినియోగం చేసుకోవాలి
మంచాల ఎల్లయ్య మాట్లాడుతూ
ముఖ్యంగా గ్రామాల్లో చెరువుకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. చెరువు ఆధారంగానే ఊరుఊరంతా బతికేది . చెరువుల్లో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది.పంట పొలాల్లో సారం నానాటికీ తగ్గిపోతోంది. సేంద్రియ పదార్థాలు, సూక్ష్మ పోషకాల శాతం అంతకంతకూ పడి పోతోంది. ఆశించిన స్థాయిలో నీరు నిల్వలేక బావుల్లోను నీళ్లు తగ్గాయి. అంతే కాదు చెరువు మట్టితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. రసాయనిక ఎరువులను మించిన పోషకాలు చెరువు మట్టి వినియోగం ద్వారా పంటలు సమృద్ధిగా అందుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా తెలిజేస్తున్నారు. సాధారణంగా చెరువు మట్టిలో 70 శాతం ఒండ్రుమట్టి, 30 శాతం బంకమట్టి ఉంటుంది.
దీంతో పాటు పోషకాలు ప్రధానంగా నత్రజని, భాస్వరం, పొటాష్, సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. చెరువు మట్టిని పంట పొలాలకు తోలడం ద్వారా పంటలకు ఆశించకుండా మిత్ర సూక్ష్మజీవులు చేరి, పంటలకు మేలు చేకూరుస్తాయి. ఇటు పంటకు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాదు నీటిని నిలుపుకొనే శక్తి 4 నుండి 7 శాతం పెరుగుతుంది. రసాయన ఎరువుల వినియోగాన్ని 10 నుండి 15 శాతం వరకు తగ్గించుకోవచ్చు.
సాధారణంగా వేసవిలో చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోతాయి . కొన్నిసార్లు పూర్తిగా అడుగంటడం వల్ల ఎండిపోతాయి. అలాంటి చెరువుల్లోని మట్టిని నేరుగా పొలాలకు తోలుకోరాదు. పంట పొలాలకు చెరువు మట్టిని తోటడానికి ముందు నేలపరీక్ష తప్పనిసరి చేయించాలి. లవణ సాంద్రత 4 కన్నా తక్కువ, నేలలో ఉదజని సూచిక 8.4 కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే చెరువు మట్టిని వాడాలి
ఈ కార్యక్రమంలో రైతులు అధికారులలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు…