మచ్చ సురేష్ ను ఐదో వార్డ్ కౌన్సిలర్ గా గెలిపించండి

- బి ఆర్ ఎస్ అభ్యర్థుల ను గెలిపించండి.
- మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరాలి.
- మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
జ్ఞాన తెలంగాణ, తొర్రూరు ప్రతినిధి :
మున్సిపల్ పరిధిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం చేస్తూ ఐదవ వార్డు లో టిఆర్ఎస్ అభ్యర్థి మచ్చ సురేష్ ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఐదవ వార్డ్ ఓటర్లను కోరారు. ఛాంబర్ అధ్యక్షునిగా రెండ వ సారి గెలిచి వ్యాపారస్తులకు చేదోడు వాదోడుగా ఉన్న మచ్చ సురేష్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాడని మచ్చ సురేష్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం చేసినారు. ఓటర్లు మచ్చ సురేష్ కు జై కొడుతూ సురేష్ కార్ గుర్తుకు ఓటేస్తామని అన్నారు. అభ్యర్థి సురేష్ మాట్లాడుతూ 30 సంవత్సరాల నుండి తొర్రూర్ లో ప్రజా జీవితంలో ఉన్నానని రెండుసార్లు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా ఎన్నికై చాంబర్ అభివృద్ధికి తోడ్పడ్డానని, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చానని ఐదో వార్డ్ అభివృద్ధి తమ ధ్యేయమని, ఐదో వార్డ్ అభివృద్ధి కొరకు ఎవరితోనైనా పోరాడతానని, ప్రజల అభివృద్ధి కోసం వార్డు అభివృద్ధి,కోసం,పాటుపడతానని ప్రజలకు వాగ్దానం చేసినారు. ఐదో వార్డు ప్రజలు ఎవరికి ఎప్పుడు ఏ కష్టం ఆపద వచ్చిన వచ్చి ప్రత్యక్షంగా కలవగలరని మీ సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మచ్చ సురేష్ ఐదో వార్డు ప్రజలతో అన్నారు. పెన్షన్లు గాని ఇల్లు లేని వారికి ఇల్లు కానీ, ఏ ఆపద వచ్చిన కలవండి, మీ సమస్యలు నా సమస్యగా పరిష్కరిస్తా.కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మైనార్టీతో గెలిపించాలని కోరారు.
