మద్యం ‘సిండికేట్’ బెల్ట్ షాపులు!

మద్యం ‘సిండికేట్’ బెల్ట్ షాపులు!
-ప్రతి గ్రామానికి 10 నుంచి 15
-ఇష్టారాజ్యంగా వైన్ షాపుల నిర్వాకం
-మండలంలో మూడు షాపులకు ఒకటి రిటైల్
-బ్రాండెడ్ మద్యం బెల్ట్ షాపుల్లో
జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 28:
చిట్యాల మండలంలో మూడు మూడు వైన్ షాపులకు అనుమతులిచ్చారు. రెండు మండల కేంద్రంలోని ఒకటి చల్లగారే గ్రామంలోని, మూడు షాపుల యజమానులు సిండికేట్ గా ఏర్పడి ఒక షాప్ రిటైల్ అమ్మకాలను, మరో షాపు గ్రామాల్లోని బెల్ట్ షాపులకు మద్యంను చేరవేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రిటైల్ అమ్మకం షాపులో బ్రాండెడ్ మద్యం అమ్మడం లేదని, బెల్ట్ షాపులకే తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. బ్రాండెడ్ మద్యంను బెల్ట్ షాపులకు తరలించి అధిక ధరలకు వికయిస్తున్నట్లు తెలిసింది. మండలంలోని షాపులలో బ్రాండెడ్ మద్యం కావాలంటే గ్రామాలలోని బెల్ట్ షాప్ ల చెంతకు పోవాల్సిందే. ఈ క్రమంలో మండలంలోని ప్రతి గ్రామంలో 10 నుంచి 15 వరకు బెల్ట్ షాపులు యథేచ్చగా కొనసాగుతున్నాయంటే ఎంతటి మామూళ్ల మత్తు కొనసాగుతుందోనని ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల అండతో బెల్ట్ షాపుల దందా కొనసాగిందనే ఆరోపణలు ఉన్నాయి. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో బెల్ట్ షాపులను బంద్ చేయించి, యువత పెడదారిన పడకుండా చర్యలు తీసుకోనుందని ప్రకటించడం జరిగింది. అయినా మద్యం వ్యాపారులు ఆ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ప్రవర్తిస్తున్నారు. ఇక్కడి రిటైల్ వైన్ షాప్ లో ప్రింటెడ్ ధర కన్నా అధికంగా వసూలు చేయడం గమనార్హం.