కేసముద్రం సబ్ స్టేషన్ విద్యుత్ రివ్యూ సమావేశం

కేసముద్రం సబ్ స్టేషన్ విద్యుత్ రివ్యూ సమావేశం
విద్యుత్ కోతలు లేకుండా చూడాలి
జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
జూన్ 14.
ఈరోజు పి.విజయ్ డి. ఇ.గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేసముద్రం సబ్ డివిజన్ రివ్యూ మీటింగ్ స్థానిక కరంటు ఆఫీస్ నందు జరిగింది మీటింగ్ ముఖ్యంశాలు సిబ్బందికి గృహజ్యోతి స్కీమ్ మరియు లబ్దిదారుల గురించి మోటివేట్ చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఏదైనా సమస్య కలిగితే దానిని చూసి పారిపోకుండా దానికి ఎదురు వెళ్లి దానిని పరిష్కరించేలా ప్రయత్నాలు చేయాలని విద్యుత్ సిబ్బంది అందర్నీ డివిజన్ ఇంజనీర్ గారు కోరారు. లూజ్ లైన్లు ఓవర్ లోడ్ ట్రాన్స్ఫార్మర్లు ఏమైనా ఉంటే వెంటనే వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 100% రెవెన్యూ కలెక్షన్ చేస్తూ, వినియోగదారుల సమస్యలను వెంటనే తీర్చాలని సిబ్బందిని ఆదేశించారు.