ఎస్సీ వర్గీకరణ జరిగితేనే ధర్మం గెలిచినట్టు.

ఎస్సీ వర్గీకరణ జరిగితేనే ధర్మం గెలిచినట్టు.

– ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ.

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి :- ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరిగితేనే దోపిడీ అనే అధర్మం మీద ధర్మం గెలిచినట్లు అవుతుందని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ అన్నారు. విలేకరుల సమావేశం కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ మాట్లాడుతూ ” గత ఏడు దశాబ్దాలుగా అమలు జరుగుతున్న ఎస్సీ రిజర్వేషన్లను ఒక్క కులం మాత్రమే దోచుకుందని, నేటికీ ఆ దోపిడీ ఏకధాటిగా కొనసాగుతూనే ఉందని అన్నారు. ఎస్సీ జాబితాలో ఉన్న అన్ని కులాలకు అందాల్సిన రిజర్వేషన్లను ఒక్క కులమే ఏక పక్షంగా దోచుకోవడం అన్యాయం , అధర్మం అని అన్నారు. ఈ అన్యాయం , అధర్మం తొలగిపోవాలంటే ఎస్సీ వర్గీకరణ తక్షణమే జరగాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారానే రిజర్వేషన్ ఫలాలు ఎస్సీ జాబితాలో ఉన్న అన్ని కులాలకు అందుతాయని అన్నారు. విద్యా, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో అందరికి అవకాశాలు లభించి అన్ని కులాలలో సమగ్రాభిృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

దోపిడీని,అసమానతలను నిర్మూలించడమే నిజమైన ధర్మం. అందుకు ఎస్సీ వర్గీకరణ చేసి కేంద్ర ప్రభుత్వం ధర్మాన్ని నిలబెట్టాలని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ కోసం కమిటిని నియమించి వేగంగా చర్యలు తీసుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పటికే ఆలస్యం అయినందున ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత ప్రక్రియను వేగవంతం చేసి పూర్తి చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ సాధనకు అడుగు దూరంలో ఉన్న సమయంలో మాదిగలు ఐక్యమత్యంతో ఉండాలని అన్నారు. అలాగే ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం గ్రామ, మండల స్ధాయిలో నూతన కమిటీలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

You may also like...

Translate »