పెబ్బేరు మరింత అభివృద్ధి చెందాలంటే బిఆర్ఎస్,పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి


జ్ఞానతెలంగాణ-పెబ్బేరు :
మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటర్లను కోరారు గురువారం పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో 12 వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు, శంకుస్థాపనలు తప్ప ఏ ఒక్క పనిని పూర్తి చేయలేదన్నారు. పట్టణంలోని వార్డులో సీసీ రోడ్డులు,రహదారులు మురుగు కాలువల నిర్మాణం పెబ్బేర్ లోని మత్స్య కళాశాల పాలిటెక్నిక్ కళాశాల చేయించిన ఘనత భారత రాష్ట్ర సమితి
(బిఆర్ఎస్) ప్రభుత్వానిది అని అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అండగా నిలిచింది బిఆర్ఎస్ మాత్రమేనని,కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విస్మరించిందని ఆరోపించారు.అన్ని వర్గాల సమస్యలు తీరాలంటే కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని,పెబ్బేర్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అండగా నిలిస్తే పెబ్బేర్ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.గత10 ఏళ్లలో కేసీఆర్ హయాంలో అభివృద్ధి అయిన పట్టణ పరిస్థితి ఇప్పుడు ఏమిటో గుర్తు చేసుకొని ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని కెసిఆర్ పాలన మళ్లీ రావాలంటే పెబ్బేర్ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

You may also like...

Translate »