శంషాబాద్ మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
by
shrikanth nallolla
·
సంక్రాంతి వేడుకలు ఆనందానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు
– మాజీ ఎంపిపి దు జయమ్మ శ్రీనివాస్.
జ్ఞాన తెలంగాణ,రాజేంద్ర నగర్,జనవరి 14 :
మకర రాశిలోనికి సూర్య భగవానుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాల శుభసమయాన తెలంగాణ యావత్తు ప్రజానీకం, రాజేంద్రనగర్ నియోజకవర్గ, శంషాబాద్ ప్రజలందరూ మకర సంక్రాంతి, కనుమ పండుగలను బంధువులు స్నేహితులతో కలిసి కుటుంబ సభ్యులందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని, మహిళా సోదరీమణులు అందరూ తమ అద్భుతమైన రంగవల్లులతో ఇంటి లోగిళ్లను సర్వాంగ సుందరంగా గొబ్బిళ్ళతో అలంకరించి నూతనత్వంతో ఇంటిల్లి పాదిని సంతోషపరచాలని, పిల్లలు యువకులు పతంగుల ఎగిరివేత కేరింతల నడుమ ఆనందోత్సాహాలతో సంతోషంగా జరుపుకోవాలని, ఈ సంక్రాంతి మీ అందరి జీవితాల్లో వెలుగులు, సంతోషాలు నింపుతూ, సిరి సంపదలు, రైతుల ఇంట ధాన్యపు రాసులతో, పశు సంపదలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని రైతుల ఇంట ఆనందాలు.పల్లెల్లో పల్లె ప్రజల్లో భోగభాగ్యాలు.ఇంటింటా సిరిసంపదలు తెలంగాణ ప్రజల్లో సంతోషాలు కలకాలం వెల్లివిరియాలని అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా జయమ్మ శ్రీనివాస్ అన్నారు.