నేడే గేట్ ఫలితాలు

– 30 సబ్జెక్టులకు గేట్‌ పరీక్షా నిర్వహణ
– ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ముగిసిన పరీక్షలు
– నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం


జ్ఞానతెలంగాణ,డెస్క్ : గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌) ఈరోజు సాయంత్రం వెల్లడి కానున్నాయి. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఐఐటీ రూర్కీ అభ్యర్థుల స్కోర్‌ విడుదల చేయనుంది. ఎంటెక్‌లో, కొన్ని విద్యాసంస్థల్లో నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశానికి, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూ)లో కొలువులకు అర్హత పొందేందుకు ఈ పరీక్షలను ఐఐఎస్‌సీ బెంగళూరు, పాత ఐఐటీలు కలిసి నిర్వహిస్తున్నాయి. మొత్తం 30 సబ్జెక్టులకు గేట్‌ జరుపుతున్నారు. గత నెల 1, 2, 15, 16 తేదీల్లో పరీక్షలు జరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 8.37 లక్షల మంది దరఖాస్తు చేశారు. సుమారు 80 శాతం మంది పరీక్షకు హాజరై ఉంటారని అంచనా. గత ఏడాది 8.26 లక్షల మంది దరఖాస్తు చేసి.. 6.53 లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 1.29 లక్షల మంది అర్హత సాధించారు.

You may also like...

Translate »