సుస్థిర పాలన కేవలం భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యం

*అన్నం పెట్టిన పార్టీకే, సున్నం పెట్టిన చరిత్ర గడ్డం రంజిత్ రెడ్డి ది

*కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానికుడు సౌమ్యుడు, నిరంతరం ప్రజల శ్రేయస్సు కొరకు పని చేసే వ్యక్తి

  • ఆరు గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ పార్టీ మాటల గారడి చేస్తుంది
  • కష్ట సాధ్యమైన ఆరు గ్యారంటీ లిచ్చి కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడ్డది
  • 4వేల వృద్ధాప్య పింఛను ఏమాయే?రెండువేల ఐదు వందల మహిళల పింఛన్ ఎవరికిచ్చారు?
  • 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు సంగతేమిటి? *రెండు లక్షల రుణమాఫీ అడిగితే, ప్రజలు నమ్మరని, దేవుళ్ళ మీద ఒట్టేసి చెబుతున్నారు. *రేవంత్ రెడ్డికి మాటలెక్కువ మ్యాటర్ తక్కువ
  • కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పథకాన్ని, కడిగి పారేసిన శక్తి కేంద్ర ఇన్చార్జ్ ఏనుగు సంజీవరెడ్డి జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: భారతదేశ సంపూర్ణ రక్షణ, సుస్థిర పాలన కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని, దేశ సేవ కోసం కుటుంబాన్ని సైతం, త్యాగం చేసి దేశ ప్రజల సంక్షేమం కొరకు నిరంతరం పరితపిస్తున్న అభినవ చత్రపతి శివాజీ, ఉక్కుమనిషి నరేంద్ర మోడీ, భారత దేశ ప్రజలంతా ఆయనకు అండగా నిలవాలని, పొద్దుటూరు గ్రామం, శంకర్ పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, భారతీయ జనతా పార్టీ, శక్తి కేంద్ర ఇన్చార్జి ఏనుగు సంజీవరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.., కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఎండగట్టారు. మహాలక్ష్మి పథకం పేరుతో ప్రతి మహిళకు ప్రతి నెల రెండువేల ఐదు వందలు, నాలుగు వేల వృద్ధాప్య పింఛన్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, ఇస్తామని ప్రకటించి మహిళలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిజెపి పార్టీ ప్రశ్నల ధాటిని తట్టుకోలేక, ఇక మా.., మాయమాటలు ప్రజలు నమ్మేస్థితిలో లేరని గ్రహించి, ఇప్పుడు ఏకంగా దేవుళ్ళ మీద ఒట్టేసి చెబుతున్నాడు. గెలిచిన వెంటనే ఏకకాలం లో అన్ని అమలు చేస్తామని చెప్పి ఏం చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కుటుంబానికి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి అసలు బస్సులే లేకుండా చేశారు, గంటల తరబడి నిలబడిన ఒక్క బస్సు కూడా సమయానికి రాని దుస్థితి ఈ రోజు నెలకొన్నదని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ మ్యాటర్ తక్కువ, రాష్ట్ర ఆర్థిక స్థితి గతులపై బొత్తిగా అవగాహన లేని వారు ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టం అని వాపోయాడు. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి నిలకడ లేని మనిషి అని, పాలిచ్చి పెంచి పోషించిన తల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీని కష్ట కాలంలో నడీ సముద్రంలో వదిలేసి అధికార దాహం తో కాంగ్రెస్ పార్టీలో చేరారని,చేవెళ్ల పార్లమెంట్ ప్రజలు అమాయకులు కాదని మే 13వ తేదీన కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆయన ఐదేళ్ల పదవీకాలంలో చేవెళ్ల పార్లమెంట్ ప్రజలకు చేసింది ఏమీ లేదని, అన్నం పెట్టిన పార్టీకే సున్నం పెట్టిన రంజిత్ రెడ్డి, రేపు ప్రజలకు న్యాయం చేస్తాడని ఎలా నమ్ముతామని దుయ్యబట్టారు. స్థానికుడు సౌమ్యుడు నిరంతరం ప్రజల సమస్యల పైన పోరాటం చేసే వ్యక్తి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి అని, ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసిన, ఎన్ని కుయుక్తులు పన్నిన ప్రజలు భారతీయ జనతా పార్టీవైపే ఉన్నారని చేవెళ్లలో గెలిచేది కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎగిరేది కాషాయపు జెండానే, కేంద్రంలో రాబోయేది నరేంద్ర మోడీ ప్రభుత్వమే అని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ కష్ట సాధ్యమైన అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసి స్వల్ప మెజార్టీతో అధికారంలోకి వచ్చింది, కష్టసాధ్యమైన, హామీలు నెరవేర్చలేక నేడు కాంగ్రెస్ పార్టీ ఆత్మ రక్షణలో పడ్డది, ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు మరియు నాలుగు వేల వృద్ధాప్య పింఛన్ ఇవ్వడం అసాధ్యమని, కాంగ్రెస్ పార్టీ చెప్పే కళ్లి బొల్లి మాటలు మరో సారి నమ్మి మహిళలు ఆ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని అన్నారు. భారతీయ జనతా పార్టీ అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని గుండెల్లో పెట్టి చూసుకుంటుందని, ప్రతిపక్ష పార్టీలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, సుస్థిర పాలన కొరకు నరేంద్ర మోడీ నాయకత్వం లోని భారతీయ జనతా పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్రతి ఒక్కరు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు.

You may also like...

Translate »