ఓటు వేస్తే ఉచిత వైద్యం

శ్రీ రక్షా హాస్పిటల్ వారి వినూత్న ఆఫర్
జ్ఞానం తెలంగాణ మే2,ఖమ్మం జిల్లా ప్రతినిధి : ఈ నెల 13న జరుగు పార్లమెంట్, 27న ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కారించుకొని, ప్రజలను చైతన్యపరచి, ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేందుకు శ్రీ రక్షా హాస్పిటల్ ఖమ్మం వారు ఓటు వేస్తే ఉచిత వైద్యం అనే ఆఫర్ ద్వారా వినూత్న ప్రయోగం చేసింది. ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి, ఓటు మీ వజ్రాయుధమని, ఎన్నికల్లో ఓటింగ్ ను ప్రోత్సహించడానికి ఓటు వేస్తే ఉచిత వైద్యం అని ఆఫర్ ప్రయోగం చేసిందన్నారు. ఓటు వేసిన వారికి రెండు నెలల పాటు శ్రీ రక్షా హాస్పిటల్ లో డాక్టర్ కన్ సల్టేషన్
ఉచితమని, మరియు వెట్రీట్
ద్వారా ఒక సంవత్సరం పాటు ఉచిత టెలిమెడిసిన్ ద్వారా వైద్యం అందించబడునని, కావున అందరూ ఓటు హక్కును వినియోగించుకొని ఉచిత వైద్య సేవలు పొందాలని శ్రీ రక్షా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, హాస్పిటల్ డాక్టర్లు మానస, షేక్ ఏడుకొండలు, సతీష్, గార్లపాటి వెంకటేశ్వర్లు, కాశీ విశ్వనాథం, తేజ్ కుమార్, ఆల్తాఫ్ మరియు వైద్య బృందం వివరించడం జరిగింది.
.