రైతులకు రుణమాఫీ చేయాలి.

రైతులకు రుణమాఫీ చేయాలి.
- కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కొత్త రామచందర్
జ్ఞాన తెలంగాణ వలిగొండ జులై 8.యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సోమవారం రోజున మండల కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని మండల తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి. ఎన్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బంధారపు లింగస్వామి కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొత్త రామచందర్ యాదవ్ అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా ఇంతవరకు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ నీ అమలు చేయలేదని ఆయన అన్నారు. రైతుల రుణమాఫీ తో పాటు రైతుబంధు రైతు బీమాను అమలు చేయాలని అదేవిధంగా కౌలు రైతుకి ఇచ్చిన హామీని అమలు చేయాలని ఆయన అన్నారు. రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంవత్సరాని 12 వేల రూపాయలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంట బీమా యోజన అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ నాయకులు బందారపు రాములు, మంద నరసింహ, పబ్బు వెంకటేశం, కట్ట దానయ్య, పెరికే వెంకటేశం, గొలనుకొండ ప్రభాకర్ ఆవుల బిక్షం సింగనబోయిన కృష్ణ సోలిపురం జనార్దన్ రెడ్డి బొడిగే ఆనంద్ బుంగమట్ల బుచ్చయ్య, అంతటి పాండు, బాలగోని మహేందర్, శివ పబ్బు, రమేష్, మైలారం బీరప్ప, సోలిపురం వేణు రెడ్డి, కొత్త అంజయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
