వంపుగూడ నీటి సమస్యకు పరిష్కారానికి కృషి చేయాలి

గ్రామ కార్యదర్శి రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలి

ఎస్సీ సెల్ కడ్తాల్ మండల అధ్యక్షుడు పోతుగంటి అశోక్

జ్ఞాన తెలంగాణ, (కడ్తాల్ )

కడ్తాల్ మండలం వంపుగూడ గ్రామంలో ప్రజలు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని మిషన్ భగీరథ వాటర్ రావడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కడ్తాల్ మండల అధ్యక్షుడు పోతుగంటి అశోక్
అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 లో చల్ల వంశీ వేసిన బోర్ వాటర్ పట్టుకోవడం జరుగుతుందని బోర్ కు సంబంధించిన కరెంట్ పీసులు తీసివేయడం, వైర్ కాట్ చేయడం జరుగుతుందని ఎన్ని సార్లు చెప్పిన గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ పట్టించుకోవడంలేదని నిర్లక్ష్యంగా చేస్తున్నాడని అతని మీద చర్య తీసుకోవాలని  కోరారు. గ్రామ ప్రజలు వాటర్ సమస్యతో బాధపడుతున్నారని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని
వాటర్ రాకుండా పీస్, వైర్ కట్ చేయడం చేస్తున్నారో వారిని పట్టుకొని అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

You may also like...

Translate »