బడుగు, బలహీన వర్గాల మహిళలకు విద్యను అందించాలి

జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి :


పెద్దమందడి మండల పరిధిలోని మోజర్ల , మద్దిగట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలు శ్రీ సావిత్రిబాయి పూలే 194వ జన్మదిన వేడుకలు , మొదటి ఉపాధ్యాయురాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.వరప్రసాదరావు మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాల యొక్క మహిళలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమతో మహిళలకు విద్యను నేర్పించడం జరిగింది. ఆనాటి కాల పరిస్థితులను ఎదుర్కొని పాఠశాలలను ప్రారంభించి మహిళలకు బోధన కొనసాగించడం జరిగిందని అన్నారు. అలాగే ఆ మహనీయురాలిని ఆదర్శంగా తీసుకొని మనమంతా ముందుకు నడవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ వరప్రసాదరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం శ్రీ రణదీవ్, ఈ వెంకటస్వామి, గద్వాల కృష్ణ, భగవంతు, శ్రీమతి వాణి ప్రభ, పుల్లయ్య, మధుసూదన్, ఎన్ వెంకటస్వామి, ఏ వెంకటస్వామి, చిన్నారెడ్డి మరియు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »