కామం, క్రోధం, లోభంపై విజయమే దసరా !

కామం, క్రోధం, లోభంపై విజయమే దసరా !

కామం, క్రోధం, లోభం అనేవి మూడు నరకద్వారాలు. అవి ఆత్మ వినాశకాలు. కాబట్టి బుద్ధిమంతుడైన ప్రతిమనుషుడు వాటిని త్యజించాలి’ అని భగవద్గీతలో కృష్ణుడు .. అర్జునుడికి హితబోధ చేశాడు. ఈ ఒక్క వాక్యంలోనే అసలైన దసరా పండుగ ఉంది. చెడుపై మంచి విజయం సాధించే శుభసందర్భమే దసరా. దసరా పండుగను దశకంఠుడైన రావణుణ్ణి సంహరించాలని చేసుకుంటారు. ఆ దశ కంఠాలు మానవుల్లోని దుర్గుణాలకు ప్రతీకలు. ప్రతి మనిషిలోనూ బహిరంగంగా.. అంతర్గతంగా ఉండే లక్షణాలను గుర్తించి.. వాటిని ఎంత వరకూ అణిచివేయగలుగుతాడో అంత విజయం సాధించినట్లు.

ప్రతి మనిషి పుట్టుకతో మంచి వాడు కాదు.. చెడ్డవాడు కాదు. పెరిగే క్రమంలో చేసుకునే అలవాట్ల, అభిరుచులు, మానసిక స్థితుల కారణంగా మారిపోతూంటారు. ఈ క్రమంలో వారు చేసే పనులు పక్క వారినే కాదు కుటుంబసభ్యులనూ బాధపెడుతూ ఉంటాయి. ఇది మంచి.. ఇది చెడు అని చెప్పే వారు ఎవరూ ఉండరు. ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే. అలా తెలుసుకుని తమను తాము మార్చుకునే పోరాటం చేయడమే చెడుపై చేస్తున్న యుద్ధం. అలాంటి అవలక్షణాలపై విజయం సాధించడమే అసలైన దసరా.


తాత్కాలికమైన సుఖాలు నిజమైన సంతృప్తిని ఎన్నటికీ ఇవ్వలేవు. తాత్కలిక ఆనందాన్ని కలిగించుకోవడం కోసం.. మిగతా జీవితాన్ని నరకం చేసుకుంటారు. అలాంటి ఆలోచనలే మనలోని అసలు రావణుడు. ఎప్పుడైతే అన్నీ ఆలోచించి కామం, క్రోధం, లోభం విషయాల్లో మనపై మనం… విజయం సాధిస్తే అప్పుడే జీవితాల్లోకి అసలైన దసరా వస్తుంది. వీటిని ఎలా అదుపు చేసుకోవాలన్న దానికి ప్రత్యేకమైన పారామీటర్స్ ఉండవు. మానసికంగా బలంగా ఉంటే చాలు. ఆ శక్తి దుర్గమ్మ ఇస్తుందన్న ధైర్యంతో ముందుకు కదలండి. అసలైన దసరా జరుపుకోండి. హ్యాపీ దసరా !

You may also like...

Translate »