మోనార్క్ డబ్బులు ఇచ్చేనా?

కష్టజీవుల కష్టం తినటం సబవేనా?*

అక్రమ వసూళ్లపై చర్యలు ఉంటాయా?

బెదిరింపులతో కార్మికుల నోరు నొక్కిది ఎవరు?

జ్ఞాన తెలంగాణ న్యూస్ కల్లూరు….

మేజర్ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కొంతమంది పారిశుద్ధ కార్మికుల నుండి 5 వేల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసిన ఆరోపణలు వచ్చాయి. చెత్తాచెదారం ఎత్తుతూ పని చేసే కష్ట జీవుల వద్ద దోచుకోవటం ఏమిటని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారి కష్టాన్ని ఈ విధంగా దోచుకోవటం పై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పచాయతీ తీర్మానాల కోసం అధికారుల పేరు చెప్పి వసూలు చేసిన ఆ డబ్బులు పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికారులు నాన్చుడి ధోరణి ప్రదర్శించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారులే గుట్టుచప్పుడు కాకుండా వసూలు చేయించారనే ప్రచారం గ్రామంలో బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. దీనికి తోడు ఈ మోనార్కు ఎవడు చెప్పిన వినడు వినే పరిస్థితిలో లేడనే అధికారులు చేతులెత్తేశారా అన్న ప్రచారం గ్రామంలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. కంటి తుడుపు చర్యగా చేస్తున్న పనిలో నుండి విధుల నుంచి తప్పించి వేరే పనిలో పెట్టడం ఇది దేనికి సంకేతం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇతను ఒకవేళ డబ్బులు వసూలు చేయకపోతే ఎందుకు చేసే పని నుండి తప్పించి ఉంటారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విధుల నుంచి మార్చినప్పుడు పరిశీలించగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని అనుమానాలు బలంగా రేకెత్తిస్తున్నాయి. ఇది ఈలా ఉండగా విచారణ చేయవలసిన అధికారులు నేటి వరకు అక్రమ వసూళ్లపై ఎటువంటి విచారణ జరపకుండా వారి యొక్క డబ్బులు ఇప్పించకుండా నాన్చుడి దోరణలో వ్యవహరించడం కష్టజీవుల కష్టం తినడం సబబేనా అని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది దేనికి సంకేతమని ఆలోచించవలసిన ఆవశ్యత ఎంతైనా ఉన్నది.పారిశుద్ధ కార్మికులు నిజాలు బయటకు చెప్పకుండా బెదిరింపులతో నోరు నొక్కుతుంది ఎవరు అంటూ అది తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపితే తేటతెల్లమవుతుంది. కాయ కష్టం చేసుకునే కార్మికుల నోటి కాడ లాక్కొని నీచమైన దుస్థితికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా ఇలా వ్యవహరించడం సబబేన అంటు తోటి సిబ్బంది తమ ఆవేదన బయటపడకుండా వ్యక్త పరుస్తున్నారు.

అక్రమ వసూళ్లకు పాల్పడిన ఈ మోనార్కపై చర్యలు ఉంటాయా అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు వేసి చూడాల్సిందే.


మండల పంచాయతీ అధికారి వివరణ
అక్రమ వసూలు పై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అని మండల గ్రామ పంచాయతీ అధికారి సురేష్ బాబును వివరణ కోరగా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ తో వెళ్లి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

You may also like...

Translate »