ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే

జ్ఞాన తెలంగాణ, న్యూస్. నారాయణఖేడ్:
ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే
కారు గుర్తుకే మన ఓటు
మనూరు మండలం తిమ్మాపూర్ మరియు చందర్ నాయక్ తండ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరిన.
గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి గారు
మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
ఇప్పుడున్న ఈ ఎమ్మెల్యే కుటుంబం మీ మండలానికి చాలా అన్యాయం చేసిందని అదేవిధంగా ఇప్పుడున్న ఈ ఎంపీ అభ్యర్థి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉండి మీ మండలానికి ఏం చేయలేదని తెలిపారు.
బిజెపి పార్టీ కట్టమని చెప్పుకుంటున్న రామ మందిరానికి కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా పెట్టలేదని రామ మందిరాన్ని మన దేశంలోని ప్రజలందరూ డబ్బులు సమకూర్చి కట్టారని నరేంద్ర మోడీ కాని కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా పెట్టలేదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎవరికైనా వస్తే రైతు రుణమాఫీ అయిన వారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కాని వారు మా కారు గుర్తుకు ఓటెయ్యండి, 2500 మహిళలకు వచ్చినవారు కాంగ్రెస్కు ఓటెయ్యండి రానీ వారు మా కారు గుర్తుకు ఓటు వేయండి, 4000 పింఛన్ వచ్చినవారు కాంగ్రెస్కు ఓటు వేయండి రానీ గారు మా కారు గుర్తుకు ఓటు వేయండి అని చెప్పారు.
ఎంపీ ఎలక్షన్లో ఓటు వేస్తే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆధార్ కార్డు ఫోటోలు అడుగుతున్నారు. వీరు ఇచ్చెడిది ఉంటే మొన్న ప్రజాపాలన దరఖాస్తులలో అన్ని ఇచ్చాము కదా అందులో నుంచి ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించారు. మీరు ఏది ఇచ్చేది లేదు పోయేది లేదు ఎన్నికల కొరకు అని ప్రలోభాలు పెడుతున్నారని ప్రజలకు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి నాగేందర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పటేల్, మోహన్ రావు, శ్రీనివాస్, నర్సింలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, బంజారా నాయకులు రవీందర్ రాథోడ్,బిఆర్ఎస్ పార్టీ యువకులు,నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
