David Warner | ఉచిత ఆధార్‌ కోసం పరుగులు తీసిన డేవిడ్‌ వార్నర్‌..

David Warner | ఉచిత ఆధార్‌ కోసం పరుగులు తీసిన డేవిడ్‌ వార్నర్‌.. ఫన్నీ వీడియో వైరల్‌

David Warner | ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్నర్‌ (David Warner) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి ఇక్కడ అభిమానులకు బాగా దగ్గరయ్యాడు.

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తరఫున ఆడుతున్న వార్నర్‌కు క్రికెట్‌ మాత్రమే కాదు..

ఇతర యాక్టివిటీలు కూడా ఎక్కువే. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన రీల్స్‌తో అభిమానులు ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు ఈ స్టార్‌ క్రికెటర్‌. తను పోస్ట్‌ చేసే ఫొటోలు, వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌, లైకులు వస్తుంటాయి.

ఈ ఆస్ట్రేలియా డ్యాషింగ్‌ ఓపెనర్‌ తాజాగా మ‌రో రీల్‌తో అభిమానుల ముందుకొచ్చాడు. తాజా వీడియోలో వార్నర్‌ ఉచిత ఆధార్‌ కార్డు (Aadhar Card) కోసం పరుగులు తీస్తూ కనిపించాడు.

You may also like...

Translate »