పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్ యోగేష్

నిర్భయంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచన


జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి, ప్రతినిధి: పదవ తరగతి ప్రభుత్వ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభ మైన నేపథ్యం లో పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేష్ స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా కమిషనర్ పాఠశాల పరిసరాలను పరిశీలించి, విద్యార్థులకు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రధానోపాధ్యాయురాలికి పలు సూచనలు చేస్తూ..,పరీక్షా కేంద్రంలో నీటి సదుపాయం, శుభ్రత, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అలాగే, పరీక్షలకు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి, “భయపడకుండా ధైర్యంగా రాయండి, మీకు మా పూర్తి సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్కరు ఉత్తర ప్రతిభ కనబరిచాలని అన్నారు. కార్యక్రమంలో పోలీసులు, మెడికల్ సిబ్బంది, విద్యాశాఖ అధికారులతో పాటు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

You may also like...

Translate »