స్నేహం ఓ వరంగా భావిస్తున్న బైరంపల్లి డిప్యూటీ సర్పంచ్ నరేష్

జ్ఞాన తెలంగాణ,కొందుర్గు, ప్రతినిధి,జనవరి 28:
గుర్రంపల్లి భాను యాదవ్ మరియు ఈశ్వర్ ముదిరాజ్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి భైరంపల్లి డిప్యూటీ సర్పంచ్ గా బాధ్యతలు తీసుకున్న కుంటోళ్ల నరేష్ అనే తన స్నేహితుడి కోరిక మేరకు పాఠశాల విద్యార్థులకి స్కూల్ బాగ్స్ బుక్స్ మరియు స్టేషనరీ ఐటమ్స్ అలాగే బీరువా అందజేశారు. గుర్రంపల్లి భాను యాదవ్ మరియు ఈశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ మా స్నేహితుని ఎదుగుదల మేము కోరుకుంటాం ఇంకా ఉన్నతమైన ఓధలో వుండాలి అని కోరుకుంటున్నాం కార్యక్రమాలు మీ పాఠశాలలో మా జి ఎస్ ఆర్ డొనేషన్ ద్వారా చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సర్పంచ్ కుంటోళ్ల నరేష్ మాట్లాడుతూ నా కోరిక మన్నించి ఇంత గొప్ప పని చేసిన తన స్నేహితులకి ధన్యవాదములు తెలిపారు మీ లాంటి మంచి మిత్రులు నాకు ఉండటం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటూ అభినందించారు. స్కూల్ టీచర్స్ మీనా మరియు జ్యోతిర్మయి కూడా ధన్యవాదములు తెలిపారు విద్యార్థులు భాను యాదవ్ ఈశ్వర్ ముదిరాజ్ మరియు డిప్యూటీ సర్పంచ్ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో ప్రస్తుత సర్పంచ్ పెద్దింటి జంగమ్మ మాజీ సర్పంచ్ ఎర్ర ఆంజనేయులు,కంటే మల్లేష్ 3వ వార్డు సభ్యులు,ఎండి జహంగీర్ 6వ వార్డు సభ్యులు, గ్రామ యువకులు ఎండి ఫక్రుద్దీన్ ,గుడిసె సాయి కుమార్, నాగులపల్లి రవీందర్,నాగుల పల్లి నర్సిములు, కుంటోళ్ల గోపాల్, బోడ రమేష్,ఎర్ర మహేష్, కంటే రాఘవేందర్, పిరంగి భూపాల్, గడ్డమిది కుమార్, గూడెం మహేష్,గడ్డమిది ప్రశాంత్,చిన్నకుర్వ వంశీ, చిన్నకుర్వ శివకుమార్,పెద్దింటి నరేష్, విజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
