BSP ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ దిష్టిబొమ్మ దహనం

సెక్యూరిటీ ఆఫీసర్ కానిస్టేబుల్ కు హోమ్ మినిస్టర్ వెంటనే క్షమాపణ చెప్పాలి

తెలంగాణ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా అక్కడికి వెళ్లిన హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారు తన సెక్యూరిటీ ఆఫీసర్ అయినటువంటి కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వేరో స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనుముల సురేష్ స్వేరో మాట్లాడుతూ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ పై చేయి చేసుకున్న హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ పై ipc సెక్షన్ 323,353,504 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని దీనికి సాక్షులుగా అక్కడే ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని పెట్టాలని మీడియా ముఖంగా డిజిపి గారిని కోరడం జరిగింది. మహమూద్ అలీని వెంటనే మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని, మెహమూద్ అలీ గారు కానిస్టేబుల్ కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోడి భీం ప్రసాద్ గారు, జిల్లా ట్రెజరర్ పాషా గారు,జిల్లా కార్యవర్గ సభ్యులు ఒంటెపాక యాదగిరి గారు నియోజకవర్గ ఇన్చార్జ్ వినోద్ చారి నియోజకవర్గ అధ్యక్షులు దున్న లింగస్వామి గారు, పట్టణ అధ్యక్షులు చిట్టిబాబు,BVF జిల్లా కో కన్వినర్ పెరిక అభిలాష్ గారు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »