సర్దార్ నగర్ సంతలో భారీగా ధర పలికిన ఎద్దులు

సర్దార్ నగర్ సంతలో భారీగా ధర పలికిన ఎద్దులు
జ్ఞాన తెలంగాణ, షాబాద్
వానాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న తరుణంలో మార్కెట్లో ఎడ్లకు భారీగా ధర పలకడం అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలోని సర్దార్ నగర్ పశువుల సంతలో మంగళవారం జరిగిన సంతలో రెండు ఎడ్లు భారీగా దర పలికాయి. ఒక ఎద్దు రూ.1,65,000 పలకగా మరో ఎద్దు రూ.2 లక్షల 15000 కు అమ్ముడు పోవడం అందర్నీ ఆశ్చర్య చకితులను చేసింది. సర్దార్ నగర్ పశువుల సంత జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే పశువుల క్రయవిక్రయాలకు ప్రసిద్ధి కాంచింది. వారానికి ఒకరోజు జరిగే ఈ సంత ద్వారా లక్షల్లో మార్కెట్కు ఆదాయం సమకూరుతుంది. అంటే వివిధ రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు అమ్మకం దారులు ఈ సంతలో పాల్గొంటుంటారు. కానీ మార్కెట్ కమిటీకి ఆదాయాన్ని పెంచే మార్కెట్ కమిటీ ఉన్నతాధికారులు మాత్రం ఈ సంత పై దృష్టి సారించకపోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతాధికారులు ఈ మార్కెట్ కమిటీ పై దృష్టి సారిస్తే ఆదాయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సంతలో ఎడ్లతోపాటు గేదెలు, ఆవుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఈ సంతలో రంగారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పలు పట్టణాలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు వ్యాపారులు సంతలో పాల్గొంటుంటారు.