మీ బిడ్డను ఆశీర్వదించండి

- పార్టీలకు తీతంగా పని చేశా
- నాపై బయటి వ్యక్తిని పోటీకి పెట్టారు
- ఖమ్మం డి.ఆర్.డి.ఏ కూరగాయల మార్కెట్ లో ఎంపీ అభ్యర్థి నామ ఎన్నికల ప్రచారం
జ్ఞాన తెలంగాణ ఏప్రిల్ 29, ఖమ్మం జిల్లా ప్రతినిధి: నేను ఖమ్మం జిల్లా రైతు బిడ్డను… మీ వాడిని… ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి …ఈ జిల్లాలోనే 3 రూపాయలకు రోజు కూలీగా పని చేసినోడిని… మీలో ఒకడిగా ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ అండగా ఉంటున్న తనని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం డిఆర్డీఏ వద్ద ఉన్న కూరగాయల సముదాయాన్ని సోమవారం ఉదయం సందర్శించి, కూరగాయల రైతులను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీలకతీతంగా పనులు చేసిన తనను దీవించాలన్నారు.జిల్లాలో 1986లో మొట్ట మొదటిసారిగా గ్రానైట్ ఫ్యాక్టరీ పెట్టి, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు.ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండి, ఏ కష్టమొచ్చినా ఆదుకునే తనను ఈ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించి, పార్లమెంట్ కు పంపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. తన మీద బయటి నుంచి తీసుకువచ్చి పోటీకి పెట్టారని, తాను మీ వాడినని, జిల్లా బిడ్డనని పేర్కొన్నారు. రెండు సార్లు పార్లమెంట్ కు పంపితే పార్లమెంట్ సాక్షిగా జిల్లా గొంతుకనై కేంద్రంతో కోట్లాడి, నిధులు తెచ్చి ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. మళ్లీ ఆశీర్వదించి, పార్లమెంట్ కు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, తోట రామారావు, మోరంపూడి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.