ఎంపీ వద్దిరాజుచే పెన్ బ్రోచర్ ఆవిష్కరణ

జ్ఞాన తెలంగాణ మే 5,ఖమ్మం జిల్లా ప్రతినిధి: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీతో కలిసి పటేల్స్ ఎంటర్ ప్రెన్యూర్స్ నెట్ వర్క్ (PEN-పెన్ )బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఖమ్మం బురహాన్ పురంలోని ఎంపీ రవిచంద్ర క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం ఈ బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. పటేల్స్ ఎంటర్ ప్రెన్యూర్స్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో హోం,లైఫ్ స్టైల్,ఫేషన్ ట్రేడ్ ఫేర్ ఈనెల 25,26వతేదీలలో హైదరాబాద్ బోయినపల్లిలోని రాజరాజేశ్వరీ కన్వెన్షన్ హాలులో జరుగుతుంది.ఆ రెండు రోజులలో ఉదయం 11గంటల నుంచి రాత్రి 8గంటల వరకు జరిగే ఈ ప్రదర్శనను ఉచితంగా సందర్శించవచ్చు.ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మీసాల సందీప్ కుమార్, గొట్టం శ్రీనివాసరావు, గుండ్లపల్లి శేషగిరిరావు, తోట రామారావు,బొక్కా సత్యనారాయణ,నానబాల హరీష్,వెంపటి ఉపేందర్,కార్తీక్,గొట్టం ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొక్కా సత్యనారాయణ ఎం పీ రవిచంద్ర సేవాగుణాన్ని ప్రస్తుతిస్తూ తాను రాసిన కవితను వినిపించారు.ఎంపీ వద్దిరాజును పెన్ సభ్యులు,బొక్కా సత్యనారాయణలు శాలువాలతో సత్కరించారు.సత్యనారాయణను ఎంపీ రవిచంద్ర శాలువాతో సన్మానించారు.

You may also like...

Translate »