బహుజన రాజ్యం కోసం తన వంతు సహాయం

బహుజన రాజ్యం కోసం తన వంతు సహాయం

జ్ఞాన తెలంగాణ.హైదరాబాద్ :05.10.2023
బహుజన రాజ్యం తేవాలని అహర్నిశలు కృషి చేస్తున్న పేదోడి కంచంలో మెతుకు,మా ఆశ దీపం డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు పోటీచేస్తున్న నియోజక వర్గంలో పని చేస్తున్న వేలాది బహుజన కార్యకర్తల కు నా వంతు సహాయంగా 100 బస్తాల బియ్యం,50 బస్తాల కందిపప్పు మొదలైన కిరాణా సామాగ్రి ఇప్పిస్తానని మిట్ట శివకుమార్ స్వేరో,హైదరాబాద్ జిల్లా స్వేరోస్ సర్కిల్స్ నాయకుడు గారు తెలిపారు.గత 10 సంవత్సరాలుగా డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నీడలో జ్ఞాన మార్గంలో సమాజానికి సేవ చేశామని,లక్షలాది పేద బిడ్డలను ఉన్నత శిఖరాల వైపు నడిపించమని అన్నారు.
నిరుపేదల కష్టాలు పోవాలంటే,కూలి బిడ్డల కడుపులో కలెక్టర్లు పుట్టాలంటే,లేబర్ అడ్డా కూలీలా పిల్లలు లండన్ లో చదవాలన్న,హమాలీల పిల్లలు హార్వర్డ్ యూనివర్సిటీ చదవాలి అన్న ప్రవీణ్ కుమార్ సార్ సీఎం కావాలి అని వారు అన్నారు.
మహనీయుల ఆశయాలను కాపాడే ప్రవీణ్ సార్ ని సీఎం ని చేయాలనీ గత 2 సంవత్సరాలుగా ఊరు వాడ,పల్లె పట్నం తిరుగుతూ సార్ త్యాగాన్ని,సార్ ఇదివరకే చేసిన గురుకులాల అభివృద్ధి ని తెలుపుతున్నామని అన్నారు.
7 సంవత్సరాల తన అత్యున్నత పదవిని త్యాగం చేసి మా జీవితాలలో వెలుగులు నింపాలని శ్రమిస్తున్న ప్రవీణ్ సార్ మాకు దేవుడితో సమానం అని అన్నారు.
నేను సాధారణ క్యాబ్ డ్రైవర్ ని ఒక్కొక్క రూపాయి పోగు చేసి నా వంతు సహాయంగా బహుజన ఉద్యమానికి ఆసరాగా ఉండాలని సహాయం చేస్తున్నట్టు తెలిపారు.

You may also like...

Translate »