బీఎస్పీలో చేరిన బద్దం బోజారెడ్డి

ముధోల్ లో బీజేపీ పార్టీకి భారీ షాక్

నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత బద్దం బోజారెడ్డి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో హైదరాబాదులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. బైంసా మండలంలోని బిజ్జుర్ గ్రామానికి చెందిన బద్దం బోజారెడ్డి ముధోల్ ఇంటలెక్చల్ ఫోరం మన గుడి-మన బడి ట్రస్ట్ స్థాపించి,గత పది సంవత్సరాలుగా ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తూ, విద్యార్థులకు పలు సేవలు అందిస్తున్నారు. ఆయన గతంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు.ముధోల్ అసెంబ్లీ బరిలో టికెట్టు ఆశించిన బద్దం బోజారెడ్డి కి టికెట్టు దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు.

You may also like...

Translate »