BSP రామగుండం నియోజకవర్గం అధ్యక్షునిగా అంబటి నరేష్

పెద్దపెల్లి సభలో బహుజన సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి,రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సమక్షంలో నియామక పత్రాన్ని అందుకుంటున్న అంబటి నరేష్
డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారూ మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ కి అంబటి నరేష్ గారి లాంటి యువ నాయకుడు, కావాలని కోరుతున్నాం అని ప్రస్తావించారు, అనంతరం BSP పార్టీ జిల్లా అధ్యక్షులు గొట్టె రాజు గారి చేతుల మీదుగా అంబటి నరేష్ గారికి రామగుండం నియోజక వర్గం అధ్యక్ష నియామక పత్రాన్ని అందజేసారు తదనంతరం అంబటి నరేష్ మాట్లాడుతూ మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఈ నీలి రంగు బహుజన జెండాను దొరల ప్రభుత్వం పై ధిక్కార పతాక లాగా ఎగుర వేస్తామని రాజ్యధికారం లక్షంగా బహుజన సమాజ్ పార్టీ బలోపేతం చేసి పార్టీ గెలుపునకు కృషి చేస్తానని సభలో అంబటి నరేష్ గారూ వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో BSP.పార్టీ కేతావత్ కృష్ట నాయక్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ ట్రైబర్ ఔట్ రీచ్ గారు, పాలకుర్తి మండల నుండి సంజీవ్ పటేల్,శివ, తదితరులు పాల్గొన్నారు,