19వ డివిజన్ ప్రజలు దాసరి భాగ్య–బాలరాజు విజయానికే ప్రచారం?

  • మట్టి–ఇసుక మాఫియా కాదు… ప్రజాసేవయే ప్రజాస్వామ్యం

జ్ఞాన తెలంగాణ,రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధి :రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ (అల్లూరు)లో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది. ఈ డివిజన్‌లో ప్రజలు స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. మట్టి–ఇసుక దందాలు, మాఫియా రాజకీయాలకు తావులేని నిజమైన ప్రజాసేవకే తమ మద్దతు ఉంటుందని ప్రజలు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాసరి భాగ్య–బాలరాజు విజయానికే ప్రజలు గట్టిగా ప్రచారం చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ ఉద్యమం మొదలైన 2004 నుంచే అల్లూరు గ్రామంలో చురుకైన యువ కార్యకర్తగా ఉద్యమంలో పాల్గొన్న దాసరి బాలరాజు, తెలంగాణ సాధన కోసం అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉద్యమ కాలంలో 12 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండి, అనేక కేసులు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గలేదు. కుటుంబాన్ని, వ్యక్తిగత సుఖసంతోషాలను పక్కనపెట్టి తెలంగాణ అభివృద్ధి, గ్రామ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ఆయన సాగించిన పోరాటం ప్రజల మన్ననలు పొందింది.
ఆదర్శవంతమైన రైతుగా, మంచి వ్యాపార దృక్పథంతో నిలబడిన బాలరాజు, కుటుంబ పెద్ద కొడుకుగా మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన తండ్రిగా కుటుంబ సభ్యులకు విద్యా అవకాశాలు, వ్యాపార అవకాశాలు కల్పిస్తూ నిస్వార్థంగా జీవించారు. మహిళలు, యువత, వృద్ధులు అన్న తేడా లేకుండా ప్రజలతో మమేకమై, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుటుంబాలతో బలమైన బాంధవ్యాలు ఏర్పరుచుకున్న వ్యక్తిగా ఆయనకు అల్లూరులో ప్రత్యేక గుర్తింపు ఉంది. మచ్చలేని రాజకీయ నాయకుడిగా పేరుగాంచిన ఆయనను ఈసారి మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చందర్ గుర్తించి, చివరి క్షణంలో హోరాహోరీగా బీఫామ్ అందించడం విశేషంగా మారింది.
దాసరి భాగ్య–బాలరాజు జనరల్ మహిళా అభ్యర్థిగా బరిలో ఉండటం పట్ల ప్రజల్లో విశేష స్పందన వ్యక్తమవుతోంది. 19వ డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండగలరనే నమ్మకంతో, అత్యధిక మెజారిటీతో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. దాదాపు ప్రతిరోజూ 200 మందికి పైగా కార్యకర్తలతో స్వయంగా ప్రచారంలో పాల్గొంటూ ప్రజల మద్దతును మరింత బలపరుస్తున్నారు.
ఈ ప్రచారంలో 8వ కాలనీ బీఆర్ఎస్‌వి అధ్యక్షుడు పులి రాకేష్, సమన్వయ కమిటీ సభ్యులు ముక్కెర మొగిలి, జేగటి మల్లేష్, ఓరగంటి శంకర్, ముష్క శ్రీనివాస్, కుమార్ నాయక్, కుమార్ యాదవ్, గుడిసె రాజేష్, గుడిసెల లక్ష్మణ్, గుడిసెల సుమలత, ఆర్ల సుధాకర్, ఆర్ల సుజాత, ఓంకార్ తదితరులు దాసరి భాగ్య–బాలరాజు విజయానికి నిరంతరం ప్రచారం సాగిస్తున్నారు.
19వ డివిజన్‌లో ఈసారి ప్రజల తీర్పు ప్రజాసేవకే అనుకూలంగా ఉండబోతోందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.

You may also like...

Translate »