అన్నదాత సుఖీభవ డబ్బులు రానివారికి మరో ఛాన్స్

అన్నదాత సుఖీభవ డబ్బులు రానివారికి మరో ఛాన్స్
అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేసింది. అయితే కొందరికి డబ్బులు పడలేదు. డబ్బులు రానివారు ఆగస్టు 20లోగా రైతు సేవా కేంద్రాల్లో అర్జీలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఈ-కేవైసీ చేయనివారు, అప్లికేషన్ రిజెక్ట్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాలకు NPCI లింక్ లేకపోవడంతో డబ్బులు జమ కాలేదని అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.