11వ తేది శనివారం సాయంత్రం 4 గంటలతో జిల్లా వ్యాప్తంగా ముగియనున్న ప్రచార కార్యక్రమాలు

11వ తేది శనివారం సాయంత్రం 4 గంటలతో జిల్లా వ్యాప్తంగా ముగియనున్న ప్రచార కార్యక్రమాలు
బల్క్ ఎస్ ఎం ఎస్ లు, సామాజిక మాధ్యమాల్లో ప్రచార పోస్టులు సైతం నిషేధం
11వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధం
*11వ తేది సాయంత్రం 4 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు సభలు, సమావేశాలు రద్దు, ప్రజలు గుంపులుగా ఉండొద్దు. పటిష్ట పర్యవేక్షణలో భాగంగా ప్రజలు యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటించాలి… జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా.
జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి:
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ముందు 48 గంటలు చాలా కీలకమని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ మిని సమావేశపు హాలులో మండల ప్రత్యేక అధికారులు,
తహసీల్దార్లు, ఎంపిడిఓలతో
పోలింగ్ కు 48 గంటల ముందు సైలెన్స్ పీరియడ్ లో చేపట్టాల్సిన చర్యల గురించి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13వ తేదీన పోలింగ్ జరుగనున్న దృష్యా
11వ తేది, శనివారం సాయంత్రం 4 గంటలకు అన్ని ప్రచార కార్యక్రమాలు ముగియనున్నట్లు తెలిపారు. ప్రజలు సమూహాలుగా గుమి కూడడం నిషేదమని తెలిపారు. పోలింగ్ కు 48 గంటల ముందు చాలా కీలకమని మైకులు, డీజేలు, సభలు, సమావేశాలు జిర్వహించుట నిషేధమని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు తమ ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 11వ తేది సాయంత్రం 4 గంటలకు ముగించాలని ఆయన తెలిపారు. ప్రచార కార్యక్రమాలు ముగిసినందున తదుపరి ఓటర్లను ప్రభావితం చేసే, ఆకర్షించే కార్యక్రమాలు జరుగకుండా పటిష్ట నిఘా కొనసాగించాలని అన్నారు. 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి పోలింగ్ ప్రక్రియ ముగిసే 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలో మద్యం విక్రయాలు నిలిపివేయాలని, ఆబ్కారీ అధికారులు పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని, విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రతి వాహనాన్ని నిశిత పరిశీలన చేయాలని అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మన జిల్లాలో 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే జరుగుతుందని, ఇట్టి పోలింగ్ సమయాన్ని ఓటర్ల గమనించి సకాలంలో ఓటు హక్కు వినియోగించు కోవాలని ఆయన సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పర్యవేక్షణ టీమ్స్ 24 గంటలు పాటు నిరంతరాయంగా పటిష్ట నిఘాలో ఉండాలని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తు.చ. తప్పక పాటించాలని, ఉల్లంఘన జరిగితే ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేసారు. అలాగే మొబైల్ ఫోన్స్ లో బల్క్
ఎస్ ఎం ఎస్ లు, సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాల పోస్టులు సైతం నిషేదమని ఆయన స్పష్టం చేశారు. సైలెన్స్ పీరియడ్ లో అక్రమాలను అడ్డుకునేందుకు అన్ని టీమ్స్ అత్యంత యాక్టివ్ గా పనిచేయాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పి సీఈవో విజయలక్ష్మి, సిపిఓ శామ్యూల్, డిపిఆర్ఓ శ్రీనివాస్, మత్య్స శాఖ అధికారి అవినాష్, వ్యవసాయ అధికారి విజయ భాస్కర్, ఉద్యాన శాఖ అధికారి సంజీవరావు, మహిళా సంక్షేమ అధికారి నాగేశ్వరరావు,
బిసి, ఎస్సి సంక్షేమ శాఖల అధికారులు శైలజ, సునీత, ఆర్డిఓ మంగిలాల్, తహసీల్దార్ లు, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.