నలుగురిలో ముగ్గురిది భారాస..

Oplus_0

హైదరాబాద్ : ఒకవైపు కాంగ్రెస్‌ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్‌ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న తమను కాదని.. ఇతర పార్టీల నేతలను చేర్చుకొని టికెట్లు ఇవ్వడమే ఇందుకు కారణం. కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా పని చేసిన సీనియర్‌ నేత సర్వే సత్యనారాయణ కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేశారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆ పార్టీ తరఫున నామినేషన్‌ వేయడం గమనార్హం. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచీ పోటీకి దిగుతున్నట్లు తెలిపారు. గతంలో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేగా గెలిచిన సర్వేకు ఇక్కడ చెప్పుకోదగిన ఓటు బ్యాంకు ఉండటంతో నేతల్లో ఆందోళన నెలకొంది.

నలుగురిలో ముగ్గురిది భారాస..

రాజధాని పరిధిలోకి వచ్చే నాలుగు లోక్‌సభ స్థానాల్లో మూడింటిలో కాంగ్రెస్‌ నేతలకు కాకుండా భారాస నుంచి వచ్చిన నేతలకే టిక్కెట్లు ఇచ్చారు.
ఖైరతాబాద్‌ నుంచి గెలిచిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీలోకి చేర్చుకుని సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. చేవెళ్ల సిట్టింగ్‌ భారాస ఎంపీ రంజిత్‌రెడ్డిని అదే స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ బరిలో నిలిపింది. మల్కాజిగిరి స్థానం నుంచి భారాస నేత, వికారాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ సునీతా మహేందర్‌రెడ్డికి హస్తం కండువా కప్పి ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అప్పటికప్పుడు భాజపా నేత శ్రీ గణేష్‌ను పార్టీలోకి చేర్చుకుని టికెట్‌ ప్రకటించారు….

You may also like...

Translate »