రేపే ఫిజియోథెరపిస్ట్ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ) సర్టిఫికెట్ వెరిఫికేషన్

Image Source| vvp telanagana.gov.in
తెలంగాణ వైద్య విధాన పరిషత్తులో ఆరు ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 27న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని టీఎస్ పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్) కార్యదర్శి అనితా రామ చంద్రన్ గారు తెలిపారు. ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నాంపల్లి లోని టీఎస్పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్) ఆఫీసులో వెరిఫికేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు.