160 ప్రశ్నలు.. ఒక్కోటి అర మార్కు

ఉపాధ్యాయ నియామక పరీక్షను 80 మార్కులకు నిర్వహించనున్నారు.ఒక్కోటి అర మార్కు చొప్పున మొత్తం 160 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. టెట్ వెయిటేజీ కింద 20 మార్కులను కేటాయించారు. 100 మార్కులకు అభ్యర్థుల మెరిట్ జాబితా రూపొందించనున్నారు. దీని ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ నియామకాలను చేపట్టనుంది. చివరిగా .. ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్రస్థాయిలో పరిశీలిస్తారు. ఒక్కో పోస్టుకు ముగ్గురిని ఎంపిక చేసి ధ్రువపత్రాల తనిఖీ చేపడతారు. ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానికతను అమలు చేయనున్నారు. జిల్లాల్లోని పోస్టులకు రోస్టర్ విధానం పాటిస్తారు. కాగా, బీఈడీ పట్టా ఉన్న అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు అనర్హులని, డీఈడీ చేసినవారు మాత్రమే అర్హులని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును టీచర్ పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకోనున్నారు.
