నీకు నువ్వే సాటి..!

నీకు నువ్వే సాటి..!
నీలో ఒక శూన్యం భ్రమిస్తూ
చీకట్లో చైతన్యాన్ని అణచివేస్తూ
నీ నమ్మకాన్ని పోగొడుతూ
అభద్రతాభావం సృష్టిస్తోంది..
ఇకనైనా నిద్రలేచి
కళ్ళముందు సత్యాన్ని గ్రహించి
రగిలే నిప్పుకనమై కదులుతూ
కిరణమై నింగిలో ప్రకాశించు..
ఇకనైనా వదులు నీ అశాంతిని
స్థిరత్వమైన పనులను చేస్తూ
ఎగిసిపడే నీటి కెరటంలా
రేపటికి విజయగాథలు సృష్టించు..
ఈనాటి ఆలోచనలే
భవిష్యత్తుకు భరోసాగా
ధైర్యాన్ని పెట్టుబడిగా పెడుతూ
గర్జించే కంఠమై కదులుతుండు…
నీకు తప్ప ఎవరికి సాధ్యం?
శక్తివి నీవే, కర్తవు నీవే
విస్తరించే పవనం నువ్వే
నింగిని గెలిచే స్వప్నం నీవే కదా..
నీకు నువ్వే సాటి
కార్యమేదైనా కర్తవు నీవే
నిరంతర పోరాటంలో
సుస్థిర నామంగా వెలుగొందు!
కొప్పుల ప్రసాద్,నంద్యాల
