మరోక్క సారి నీట్ ఎండీఎస్ దరఖాస్తులు

Image Source | Wallpaper Cave
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఎండీఎస్(మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) కటాఫ్ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తగ్గించిన నేపథ్యంలో కన్వీనర్ మరియు యాజమాన్య కోటాలో దరఖాస్తులపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం వేరు వేరు గా నోటిఫికేషన్లు విడుదల చేసింది.అర్హులైన అభ్యర్థుల ల నుండి నేటి నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయ ఉన్నత అధికారులు తెలిపారు . ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలని సూచించారు.ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేస్తామన్నారు.అర్హత, ఇతర వివరాల కొరకు ఈ క్రింది వెబ్సైటు చూడాలన్నారు
వెబ్సైటు : www.knruhs.telangana.gov.in
