సిద్దిపేటలో ఎగ్జిబిషన్‌ సొసైటీ ఫార్మసీ కళాశాల

జ్ఞాన తెలంగాణ హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో రంగనాయక ఫార్మసీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ కళాశాలను ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్ లోనూ చేర్చారు. ఈ సంవత్సరం బీఫార్మసీ కోర్సును అందుబాటులోకి తీసుకురాగా.. వచ్చే ఏడాది ఫార్మా డి ప్రవేశపెడతామని సొసైటీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 125 ప్రైవేట్ ఫార్మసీ కళాశాలలు ఉండగా… మరో అయిదారు కొత్తగా ఈ సంవత్సరం మంజూరయ్యాయి.

You may also like...

Translate »