ఈ నెల 18 నుంచి టెన్త్ ఎగ్జామ్

Image Source|Newstep

ఈ నెల 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్

  • రాష్ట్రవ్యాప్తంగా 2676 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు1
  • అటెండ్ కానున్న 5.08 లక్షల మంది విద్యార్థులు

జ్ఞాన తెలంగాణ:

ఈ నెల18 నుంచి తెలంగాణలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎగ్జామ్స్ నిర్వహణలో ఇబ్బందులు రావొద్దని, లీకేజీలు లేకుండా చర్యలు తీసుకో వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పరీక్షల ను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అన్నిరకాల ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది స్టూడెంట్లు టెన్త్ పరీక్షలకు అటెండ్ కానున్నారు. వీరి కోసం 2676 పరీక్షా కేంద్రాలను ప్రభుత్వ పరీక్షల విభాగం ఏర్పాటు చేసింది. కాగా, టెన్త్ పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకూ కొనసాగనున్నాయి. అయితే, సైన్స్ సబ్జెక్టులో ఈ ఏడాది నుంచి బయాలజీ, ఫిజిక్స్ పేపర్లను రెండు వేర్వేరు రోజుల్లో నిర్వహించనున్నారు. టైమింగ్ గంటన్నరనే ఉండనున్నది. ఈ నెల 26న ఫిజికల్ సైన్స్ పేపర్ ఉదయం 9.30గంటల నుంచి 11గంటల వరకూ, 28న బయాలాజికల్ సైన్స్ పేపర్ ఉదయం 9.30గంటల నుంచి 11గంటల వరకు ఉంటుంది.హాల్‌ టికెట్లను https://bse.telangana. gov.in వెబ్ సైట్లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.

  1. ↩︎

You may also like...

Translate »