15 వ తేదీ నుంచి ఒంటి పూట బడులు

15 వ తేదీ నుంచి ఒంటి పూట బడులు
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్, జ్ఞాన దీక్ష డెస్క్:
హైదరాబాద్: వేసవి తీవ్రత పెరుగుతున్నందున ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15-4-2024 నుంచి 23-4-2024 (విద్యా సంవత్సరం ముగిసే వరకు) రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు బడులు నడపాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టి వారి ఇంటికి పంపించాలని స్కూల్స్ నిర్వాహకులకు ఆదేశాలను జారీ చేసింది. పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం అవుతోన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాల్లో పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని వెల్లడించింది..