31న అంబేడ్కర్‌ వర్సిటీ బీఈడీ ప్రవేశ పరీక్ష

31న అంబేడ్కర్‌ వర్సిటీ బీఈడీ ప్రవేశ పరీక్ష


డా.బీ.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఈడీ, బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) అర్హత పరీక్ష 2024-25కు నోటిఫికేషన్‌ విడుదలైంది

ఈనెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా. భోజు శ్రీనివాస్‌ సూచించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రవేశ పరీక్ష ఫీజు ఓసీ, బీసీలకు రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.750గా నిర్ణయించినట్లు తెలిపారు. డిసెంబరు 31న ఉదయం 9నుంచి 11గంటల వరకు బీఈడీ (జనరల్‌) పరీక్ష, అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4గంటల వరకు బీఈడీ(స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. వివరాలకు 040-23680333/444/555, విశ్వవిద్యాలయ వెబ్‌పోర్టల్‌ www.braouonline.in సంప్రదించొచ్చన్నారు

You may also like...

Translate »