కొండా విశ్వేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన

కొండా విశ్వేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన
మహేశ్వరం ఎంపిటిసి పోతర్ల సుదర్శన్ యాదవ్
జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)
చేవెళ్ల ఎంపీగా 1,70,000 భారీ మెజారిటీతో గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని మహేశ్వరం ఎంపిటిసి పోతర్ల సుదర్శన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడి బిజెపి ఎంపీ గెలుపు కోసం నిరంతరం శ్రమించి పార్టీని గెలిపించారని ఆయన అన్నారు. అందరూ కలిసి సమిష్టిగా పనిచేయడం వల్ల విజయం దక్కిందని సుదర్శన్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు బిజెపి గెలవడం సంతోషంగా ఉందని ఇది శుభ పరిణామం అని సుదర్శన్ యాదవ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం బిజెపి పెద్దలు కార్యకర్తలు కలిసి తదితరులు పాల్గొన్నారు.