బ్యాంక్ అఫ్ బరోడా జోనల్ మేనజర్ కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

బ్యాంక్ అఫ్ బరోడా జోనల్ మేనజర్ కు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.
జ్ఞాన తెలంగాణ,ఘన్పూర్ స్టేషన్:
బ్యాంక్ అఫ్ బరోడా జోనల్ మేనేజర్ రితీష్ కుమార్ గారిని కలిసి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు వినతి పత్రం అందజేశారు. జఫర్గడ్ మండలంలోని బ్యాంక్ అఫ్ బరోడా బ్యాంక్ ను స్టేషన్ ఘనపూర్ కు మార్చారాని తిరిగి బ్యాంక్ బరోడా బ్యాంక్ ను జఫర్గడ్ మండలానికే మార్చాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు బ్యాంక్ అఫ్ బరోడా జోనల్ మేనేజర్ రితీష్ కుమార్ గారిని కలిసి కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆర్బీఐ అనుమతులు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా జఫర్గడ్ గ్రామం నుండి పని చెయాలని తెలిపారు. బ్రాంచ్ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.