తండాలో త్రాగునీటి కష్టాలుపట్టింపులేని అధికారులు

  • నాడు ఆదర్శ గ్రామం
    నేడు సమస్యలకు నిలయం
  • గ్రామంలో త్రాగునీటి ట్యాంకి శుభ్రత కరువు
  • పేరుకే స్పెషల్ ఆఫీసర్
    జ్ఞాన తెలంగాణ మహబూబాబాద్,
    తండాలో త్రాగునీటి కష్టాలు నెలకొన్నాయి వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామపంచాయతీ పరిధి చెరువుకొమ్ము తండాలో తండావాసులకు త్రాగునీటికి అనేక కష్టాలు పడుతున్నారు. మూడు నెలల నుండి పలుమార్లు పంచాయతీ కార్యదర్శి అధికారులకు చెప్పినా కూడా ఫలితం శూన్యంగా మారిందని సర్పంచ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ ను కేటాయించారు కానీ పేరుకే స్పెషల్ ఆఫీసర్ కంటికి కనిపించని వైనం గా మారింది. ఈ మేరకు తక్షణమే స్పందించి వెంటనే సోలార్ పంపు రిపేరు ,ట్యాంక్ మరమ్మత్తు చేయించి త్రాగునీటి దాహార్తిని తీర్చాలని తండావాసులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన చేపట్టి మా త్రాగునీటి సమస్యను తీర్చండి మహాప్రభో అంటూ మొరపెట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలోని వాటర్ ట్యాంక్ శుభ్రతకు కరువై పూర్తిగా గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలు తీవ్ర అనారోగ్య పాలవుతున్నారు. అది నీటిని త్రాగుటకు ఉపయోగించని పరిస్థితి నెలకొంది. నాడు ఆదర్శ గ్రామంగా పేరు ప్రఖ్యాతలుగాంచిన గ్రామం నేడు సమస్యలకే నిలయమై పారిశుద్ధ్య పనులు చేపట్టగా పోవడం ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి అని బహిరంగంగా గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ మేరకు తండావాసులు అధికారి పనితీరు బాగాలేదని సరైన రీతిలో స్పందించకపోవడం లేదని ఇప్పటికైనా ఉన్నత పై అధికారులు స్పందించి మా సమస్యను గుర్తించాలని ప్రభుత్వాన్ని అధికారులను వేడుకుంటున్నారు.

You may also like...

Translate »