రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలి
- నిరుద్యోగ భృతి ఆరు వేలు ఇవ్వాలి
- నిరుద్యోగ సమస్య పరిష్కరించి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి
*- పి వై ఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాటోత్ ప్రేమ్ సింగ్ ఎన్ వి రాకేష్..
జ్ఞాన తెలంగాణ ఖమ్మం మే 30
*రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్య ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరుద్యోగ భృతి 6000 ఇవ్వాలని పి వై ఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాటోత్ ప్రేమ్ సింగ్ ఎన్ వి రాకేష్ లు తెలిపారు.*
స్థానిక ఎం వెంకటాయపాలెం గ్రామంలో గంగవరపు శ్రీనివాస్ భవనంలో పి వై ఎల్ డివిజన్ ఉపాధ్యక్షులు తోట రమేష్ అధ్యక్షతన జరిగిన ప్రగతిశీల యువజన సంఘం పి వై ఎల్ పాలేరు డివిజన్ కమిటీ సమావేశం వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి నిరుద్యోగులు ఉద్యోగాలు రాక నిరుద్యోగ భృతి లేక దిక్కుతోచని పరిస్థితిలలో కాయ కష్టం చేస్తూ జీవిస్తున్నారని,పని చేద్దామన్న పని దొరకక నానా అవస్థలు పడుతున్నారని, ఎంతోమంది యువతి యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోయి యువత బతకలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, వాదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి, నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరుద్యోగ భృతి 6000 ఇవ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగ సమస్యపై పోరాడుతున్న ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ఖమ్మం జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు మరియు కౌన్సిల్ ను జూన్ 06 తేదీన ముచ్చర్ల గ్రామంలో నిర్వహిస్తున్నామని ఈ క్లాసులకు జిల్లా నలుమూలల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరవుతారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పి వై ఎల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మామిడాల వెంకటేష్, డివిజన్ సహాయ కార్యదర్శి పరికపల్లి మధు, కోశాధికారి తోకల సంపత్, డివిజన్ నాయకులు మాలాదా ఉపేందర్ రావు, గుడిచుట్టు రాజేష్ పాల్గొన్నారు..