రక్తదాన శిబిరంలో పాల్గొన్న గడ్డం రంజిత్ రెడ్డి

రక్తదాన శిబిరంలో పాల్గొన్న గడ్డం రంజిత్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ,నవాబుపేట్ మండలం:
రక్తదాతలు నిజమైన ప్రాణదాతలు అని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం శేర్లింగంపల్లి అసెంబ్లీ ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేసి విలువైన ప్రాణాలను కాపాడాలని పేర్కొన్నారు. రక్తదాతలను అభినందించారు.