బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు మీ ఓటుతో బుద్ది చెప్పండి..

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు మీ ఓటుతో బుద్ది చెప్పండి..
- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జ్ఞానతెలంగాణ,భూపాలపల్లి,మే10:
భూపాలపల్లి రూరల్ మండలం
పదేళ్ల బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేపట్టిన నిరంకుశ, ప్రజా వ్యతిరేక పాలనకు మీ ఓటుతో బుద్ది చెప్పండని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఉదయం భూపాలపల్లి రూరల్ మండలంలోని గొర్లవీడు గ్రామంలోని పెద్దచెరువు వద్ద ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే జీఎస్సార్ మాట్లాడారు.
ఈ పదేళ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ ల పాలనలో ప్రజలకు చేసిందేమి లేదని ఆరోపించారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ కడియం కావ్యకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎస్సార్ వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.
