రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ మాదిగలకు వ్యతిరేకం.రిజర్వేషన్లు రద్దు చేసే పార్టీ,వర్గీకరణ ఎలా చేస్తుంది?

పత్రికా ప్రకటన
05/05/2023
అచ్చంపేట.
రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ మాదిగలకు వ్యతిరేకం.
రిజర్వేషన్లు రద్దు చేసే పార్టీ,వర్గీకరణ ఎలా చేస్తుంది?
రాహుల్ గాంధీ కోటీశ్వరుల వైపేనా
డా..ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఎంపి అభ్యర్థి బిఆర్ఎస్.
ఖమ్మం దళారులను ఓడిద్దాం.
ఎంపి ఎన్నికల్లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంటా.
పోతుగంటి రాములు ఉద్యమ ద్రోహి.
గువ్వల బాలరాజు
మాజీ శాసన సభ్యులు. అచ్చంపేట.
డప్పులు కొట్టిన మాదిగలు లక్షాధికారులు,కోటీశ్వరులు కావాలి,విద్యావంతులు,మేధావులు కావాలి.
విమానాల్లో ప్రయాణించాలి,కార్ల ఓనర్లు కావాలని ప్రవీణ్ కుమార్ ఆకాక్షించారు.
అచ్చంపేటలోణి జికె ఫంక్షన్ హాల్ లో మాదిగల రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన మాదిగల ఆత్మగౌరవ సభలో బిఆర్ఎస్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వ బాలరాజు పాల్గొన్నారు.
బిజెపి మాదిగలను వాడుకుంటున్నది. కృష్ణన్న అంటే నాకు గౌరవం కానీ,కృష్ణన్న భుజాన మీద తుపాకీ పెట్టి మాదిగలను మళ్లీ అణిచివేయాలని చూస్తుందన్నారు. పదేళ్ల నుండి వర్గీకరణ చేయని మోడీ ఎన్నికలు రాగానే కృష్ణన్నను ఆలింగనం చేసుకున్నారని విమర్శించారు.
అయోధ్య రామమందిర ప్రతిష్టాపణకు ఎందుకు కృష్ణన్న ను పిలవలేదు? మాదిగ కాబట్టి కాదా అని ప్రశ్నించారు.మోడీ,బిజెపికి మాదిగలంటే గౌరవం లేదన్నారు.
గుజరాత్ లో దళితులను కట్టేసి కొట్టింది బిజెపి ప్రభుత్వం కాదా? ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు మాదిగల ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.
చేవెళ్ల నియోజకవర్గం జన్వాడ గ్రామంలో మాదిగల మీద దారుణంగా దాడి చేస్తే, బిజెపి ఎందుకు ఖండించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఈ సంఘటనపై స్పందించిన ఏకైక వ్యక్తిని నేనే అని స్పష్టం చేశారు.
బిజెపి రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం అంటున్నది, రాజ్యాంగం రద్దయిన వెంటనే రిజర్వేషన్లు రద్దు అవుతాయని, రిజర్వేషన్లు రద్దు చేసే పార్టీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం ఎలా చేయగలదో చెప్పాలన్నారు.
తెలంగాణలో మూడు ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే ఒక్క సీటు కూడా 18 శాతం ఉన్న మాదిగలకు ఇవ్వలేదు అంటే
కాంగ్రెస్ మాదిగల వ్యతిరేక పార్టీ కాదా అన్నారు.
పేదలందరినీ కోటీశ్వరులను చేసే ఒక ప్లాన్ నా దగ్గర ఉందని,ఒక్క సారి గెలిపించండి, మీ బతుకులు మార్చే అవకాశం ఇవ్వండని కోరారు
వేల కోట్ల అక్రమంగా సంపాదించుకున్న మల్లురవిని గెలిపించాలని రాహుల్ గాంధీ వస్తున్నారు. రాహుల్ గాంధీని అక్రమంగా కోట్లు సంపాదించిన దొంగలకు ఎలా మద్దతిస్తరని నిలదీయాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే గువ్వ బాలరాజు కుడి భుజంగా ఉండి, మీ అందరికోసం పని చేస్తానని హామీ ఇచ్చారు.
…..
గువ్వల బాలరాజు మాజీ శాసన సభ్యులు మాట్లాడుతూ,
అచ్చంపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని.. ఙ్ఞానం కోసం పరితపిస్తానన్నారు.. ఎమ్మెల్యే అయిన తరువాత కూడా చదువుకున్నానని చనిపోయేవరకు చదువుతూనే ఉంటానని అన్నారు.
పోతుగంటి రాములు ఉద్యమ ద్రోహి అన్నారు. నా వల్లనే గతంలో రాములుఎమ్మెల్యేగా గెలిచారన్నారు. నాకు ఓటమి పెద్ద లెక్క కాదన్నారు. ఎంపి ఎన్నికల్లో
ప్రవీణ్ కుమార్ ను గెలిపిచి ప్రతీకారం తీర్చుకుంటామని అచ్చంపేటలో అత్యధిక మెజారిటీ సాధిస్తామని సవాల్ చేశారు. మా జాతి బిడ్డలను బెదిరిస్తున్నారని,మా బిడ్డలపై పై ఈగ కూడా వాలినివ్వనన్నారు. ఖమ్మం నుండి వచ్చిన దళారీలను ఓడించాలని పిలుపునిచ్చారు.
ఖమ్మం వాల్లో, మేమో తేల్చుకుంటామన్నారు.
కార్యక్రమంలో సభాధ్యక్షులు శంకర్, జిల్లా నాయకులు మంగి విజయ్,కాశన్న తదితరులు పాల్గొన్నారు.