బోధన్ ఆర్టీసీ కాలనీ నూతన కమిటి అధ్యక్షులుగా కృష్ణ

బోధన్ ఆర్టీసీ కాలనీ నూతన కమిటి అధ్యక్షులుగా కృష్ణ
జ్ఞాన తెలంగాణ – బోధన్
బోధన్ పట్టణంలోని ఆర్టీసి కాలనీ నూతన కమిటీ అధ్యక్షులుగా కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. శుక్రవారం బోధన్ ఆర్టీసీ కాలనీలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో బాలగంగాధర్ రావు, పరుచూరి నగేష్ బాబు, బాలగౌడ్, వెంకటేశ్వర్రావుల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ ఉపాధ్యక్షులుగా వడ్ల గోపి, ప్రధాన కార్యదర్శిగా రావెళ్ళ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా హనుమంతరావు, చిరంజీవి, కోశాధికారిగా నరేందర్ గుప్తా, స్టీరింగ్ కమిటీ సభ్యులుగా పరుచూరి శ్రీనివాస్ రావు, సర్వేశ్వర్, నగేష్, దత్తు, అరవింద్, అర్జున్, రాజు,బలరాం లను ఏకగ్రీవంగా ఎన్నున్నారు.ఈ సంధర్బంగ నూతన కమిటి సభ్యులు మాట్లాడుతూ ఆర్టీసీ కాలనీ సమస్యలపరిష్కారానికి, కాలనీ అభివృద్ది కొరకు తమపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు కాలనీ పెద్దలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం. ఎన్నికైన వారిని కామేపల్లి సత్యం శాలువతో ఘనంగా సన్మానించారు.
