టంగుటూరు గ్రామం హస్తమయం, ఇంటింటి ప్రచారానికి అనూహ్యస్పందన

ప్రతి గడపకు వెళ్ళి,ప్రతి ఓటరును కలిసి, నిర్విరామంగా శ్రమిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

  • మా ఓటు కాంగ్రెస్ కే నంటు బహిరంగ మద్దతు తెలియజేస్తున్న టంగటూరు గ్రామ ప్రజలు జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: లోక్ సభ ఎన్నికల ఘడియలు సమీపిస్తున్న వేళ, శంకర్ పల్లి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి ఉదయ సాయంత్రాలలో రెండు గ్రామాలను ఎంచుకొని, ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం టంగుటూరు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి ప్రతి ఓటర్ను కలిసి, మే 13న జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి చెయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని, ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు క్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకెళుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రతి మహిళకు ప్రతినెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం,ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు, నాలుగు వేల వృద్ధాప్య పింఛను, ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను ఓటర్లకు పూస గుచ్చినట్టు వివరించి చెప్తున్నారు. రైతు రుణమాఫీ రెండు లక్షలు ఆగస్టు 15లో ప్రభుత్వం చెల్లిస్తుందని ఏ రైతు కూడా సందేహ పడాల్సిన అవసరం లేదని, మనం చేయాల్సిందల్లా మే 13న జరగబోయే ఎన్నికలలో చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని తెలియజేస్తున్నారు. ఈ యొక్క ఇంటింటి ప్రచారానికి గ్రామ మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలను స్వాగతించి జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై రేవంత్ రెడ్డి, జై రంజిత్ రెడ్డి, జై భీమ్ భరత్ వంటి నినాదాలతో సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కె ఉదయ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ సంక్షేమ పాలనకు మనమందరం మద్దతుగా నిలవాలిచి, రేపు జరగబోయే ఎన్నికలలో హస్తం గుర్తుకు ఓటు వేసి, కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి భాగస్వామ్యం కావాలని తెలియజేశారు. పేదల సంక్షేమం కొరకు ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని ఎవరికీ కూడా అనుమానాలు అక్కర్లేదని, ఎవరు కూడా అపోహ పడవద్దని తెలియజేశారు. ఇంత గొప్పగా స్వాగతం పలికి గ్రామంలోని ప్రతి వీధి, ప్రతి గడపకు తిప్పిన, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలకు,ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు సాని ప్రకాష్ గుప్తా, శంకర్ పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, శంకర్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏనుగు రవీందర్ రెడ్డి, మహిళా నాయకురాళ్లు,బి బ్లాక్ ఇన్చార్జి సౌమ్య రెడ్డి, మాజీ ఎంపీటీసీ మహమ్మద్ ఎజాజ్ , శంకర్ పల్లి కౌన్సిలర్ సంధ్యారాణి అశోక్ కుమార్, సీనియర్ నాయకులు యాదయ్య,సింగపూర్ మాజీ ఎంపీటీసీ రామచందర్, శ్రీశైలం, పొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాని బుచ్చయ్య, మందు మూల శ్రీనివాస్, శంకరయ్య, గ్రామ మహిళలు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

You may also like...

Translate »